హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీధిలో భారీ కొండచిలువ కలకలం...!

MHBD: కేసముద్రం మండలం కిష్టాపురం వీధిలో ఉదయం కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయపడ్డారు. పరమేశ్వర్ కిరాణా షాపు సమీపంలోని గల్లీలో యువకులు కొండచిలువను గుర్తించి వీడియో తీశారు. జనావాసాల మధ్య పాము సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. గల్లీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.