హైదరాబాద్: 28°C
తెలంగాణ

నివాళులర్పించిన సీపీఐ నేతలు

SDPT: చేర్యాల మండలం వేచరేణికి చెందిన సీపీఐ మండల నాయకుడు ఎగుర్ల ఎల్లయ్య తల్లి సిద్ధవ్వ (90) అనారోగ్యంతో సిద్దిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు అందె అశోక్, ఆలేటి యాదగిరి, ఈరి భూమయ్య, నంగి కనకయ్య తదితరులు ఆదివారం గ్రామానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.