హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు

SKLM: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమదాలవలస మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కృషితో రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు టీడీపీ నేత డీ.అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. YCP నేత రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.