హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దెబ్బతిన్న వంతెన రక్షణగోడ

PPM: గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభద్ర వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువపై ఉన్న వంతెన కింద రక్షణగోడ దెబ్బతింది. నాగావళి సాగునీటి ఉధృతికి వంతెన పిల్లర్లు, గట్టు కింద మట్టి కొట్టుకుపోకుండా నిర్మించిన కాంక్రీటు రైలింగ్‌ బీటలు వారింది. ఇప్పటికే సగభాగం దెబ్బతినడంతో నీటి ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయి వంతెనకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.