MLG: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి వైన్స్ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల కారును ట్రాక్టర్ ఢీకొనడంతో కారు పల్టీలు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: కారు ప్రమాదం.. పలువురికి గాయాలు


