హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులను పరామర్శించిన MLA

KNR: గంగాధర మండలం మధురానగర్‌లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొనడంతో మంగపేటకు చెందిన లింగాల దేవమ్మ మృతి చెందారు. ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన మరో వ్యక్తితో పాటు పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ప్రభుత్వ, ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.