హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆస్తులు అమ్ముకొనే రాజకీయం చేస్తున్నా'

కోనసీమ: మండపేట నియోజకవర్గంలో అత్యంత ధనిక వర్గానికి చెందిన తాను ఉన్న ఆస్తులు అమ్ముకొనే రాజకీయం చేస్తున్నానని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పునరుద్ఘటించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఓం సిటీ భూ సేకరణలో రైతులను బెదిరించి దందా చేశారని తోట త్రిమూర్తులుపై ఆరోపణలు చేశారు. మండపేట పురపాలక సంఘం మాస్టర్ ప్లాన్ ఆమోదం కాకుండా తొక్కి పెట్టారనీ విమర్శించారు.