BDK: మణుగూరులో శివ మృతి ఘటనపై ఆదివారం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం సీఐ నాగబాబు, ఎస్సై నాగేష్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది. హత్య కేసులో నిందితుల కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ
హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం


