హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుస్తక పఠనంతో విద్యార్థులకు విజ్ఞానం'

VZM: తెర్లాం శాఖా గ్రంథాలయంలో ఆదివారం ‘చదవడం మాకు ఇష్టం’ కార్యక్రమం నిర్వహించారు. పుస్తక పఠనంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని గ్రంథాలయ అధికారి సీహెచ్.కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులతో కథలు, ఇతిహాస గ్రంథాలు చదివించారు. అనంతరం బొమ్మలు గీయడం, కథలు చెప్పడం, రాయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నప్పటి నుంచే పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.