హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాలకు శంకుస్థాపన చేసిన విప్

PLD: ఈపూరు మండలం ఇనుమెళ్లలో శ్రీ భావనారాయణ స్వామి, శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దంపతులు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. ఆలయాల నిర్మాణం గ్రామాభివృద్ధికి, ప్రజల ఆధ్యాత్మిక సౌఖ్యానికి దోహదపడుతుందని జీవీ ఆంజనేయులు ఆకాంక్షించారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన పాల్గొన్నారు.