హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిన్నిస్ వరల్డ్ రికార్డులో నిధిష్ ఠాకూర్

PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తనయుడు నిధిష్ ఠాకూర్ ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వామిగా నిలిచారు. ఈ నెల 9న HYDలో నిర్వహించిన అతిపెద్ద తైక్వాండో పాఠంలో 533 మంది పాల్గొనగా, నిధిష్ ఇందులో భాగమయ్యారు. జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్ థియేటర్స్ సంయుక్తంగా సాధించిన ఈ రికార్డుకు గుర్తింపుగా నిర్వాహకులు సర్టిఫికెట్ అందజేశారు.