హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్సింగి - మాడెట్పల్లి రహదారికి మహర్దశ

MDK: నార్సింగి, దశాబ్ద కాలంగా అధ్వానంగా ఉన్న రహదారులకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో నార్సింగి నుంచి మాడెట్పల్లి వరకు 11 కి.మీ మేర నూతన రహదారి నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు శనివారం ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.