హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చలో కలెక్టర్

NDL: ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్‌ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు నూనెపల్లె ఉదయానంద హోటల్‌ నుంచి ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్‌కు చేరుకుంటుందని వైసీపీ మండల కన్వీనర్‌ బసవేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  కోరారు.