హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ

NGKL: అచ్చంపేట మండలంలోని ఐనోల్ గ్రామ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఇవాళ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి వారికి అందుతున్న వసతులు, విద్యా సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు.