హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం

కడపలో ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య ఆదివారం ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.