హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాల భైరవ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

కోనసీమ: ఎస్.యానాంలో ఉన్న ఆంధ్రా గోవా కోకో బీచ్‌లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదివారం శాస్త్రోక్తంగా భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంతో ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభతో పాటు పర్యాటక ప్రాధాన్యత మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నేతలు పాల్గొన్నారు.