బాపట్ల సూర్యలంక బీచ్‌కు పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నుంచి వేలాదిగా పర్యాటకులు తరలివచ్చారు. ఆహ్లాదకరమైన సముద్ర స్నానాలతో సందర్శకులు సందడి చేశారు. పర్యాటకుల రిసార్ట్స్ జనంతో నిండిపోయాయి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తీరంలో గజ ఈతగాళ్లు, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సూర్యలంక బీచ్‌కు పోటెత్తిన పర్యాటకులు


