హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పాడలో వెనక్కి వెళ్ళిన సముద్రం

కాకినాడ: కొత్తపల్లి మండలం ఉప్పాడ సాగర తీరంలో ఆదివారం సముద్రం కొంతమేర వెనక్కి వెళ్లడంతో స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందారు. తుఫాను పరిస్థితులు ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం తరచుగా జరుగుతుందని వారు తెలిపారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు మార్పులు కారణంగా అలల తీరు తెన్నుల్లో మార్పులు చేసుకుంటాయని అన్నారు.