శ్రీకాకుళంలోని నటీనటులు, టెక్నీషియన్లను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటుకు ఆదివారం శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో సంఘం విధివిధానాలను వివరించారు. కళాకారులకు గుర్తింపు, నటీనటులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు


