హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మర్రి చెట్టుకు 'వృక్షా బంధన్'

VSP: విశాఖ మహానగర్ పర్యావరణ గతివిధి ఆధ్వర్యంలో ప్రకృతికి వందనంలో భాగంగా తాటిచెట్లపాలెం ధర్మానగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న పురాతన మర్రి చెట్టుకు ఆదివారం విత్తనాలతో తయారు చేసిన ‘వృక్షా బంధన్’ రాఖీని కాలనీ వాసులు, చిన్నారులతో కట్టించారు. ‘నేను నీకు రక్ష, నీకు నేను రక్ష, మనమందరం పర్యావరణానికి రక్ష’ నినాదంతో ప్రదర్శన నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.