KDP: కడప- చెన్నై జాతీయ రహదారిపై ఉన్న ఒంటిమిట్ట ఆర్టీసీ బస్టాండులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బస్సు షెల్టర్ వద్ద మృతదేహాన్ని గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వ్యక్తి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వ్యక్తి మృతి..!


