హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటి సంగీత విభావరికి విశేష స్పందన

తిరుమలలో కోటి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోటి స్వరాల స్వర సంగమం’ సంగీత విభావరి భక్తులను విశేషంగా అలరించింది. భక్తిగీతాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలతో శ్రీకోటి బృందం ఆకట్టుకుంది. కార్యక్రమానికి హాజరైన టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కోటి బృందాన్ని అభినందించారు. అనంతరం ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ ఆధ్వర్యంలో కోటి, ఆయన బృందాన్ని శాలువాతో సత్కరించారు.