శ్రీకాకుళం జిల్లా పూండి సాగర్ కాలనీలో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పై అంతస్తులోకి ప్రవేశించిన దుండగులు సూట్‌కేసులోని మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ టి.భవాని, సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని ఆదివారం పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పూండిలో చోరీ కలకలం


