కోనసీమ: రావులపాలెం పట్టణంలోని మారుతీనగర్ లోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం భూమిపూజ చేశారు. రూ.80 లక్షల సీజీఎఫ్ నిధులతో పునర్నిర్మాణం చేపట్టారు. 84 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంపై భక్తులకు అచంచల విశ్వాసం ఉందని, భూమిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆంజనేయస్వామి వార్షికోత్సవంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ


