హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త ఇంటి ముందు క్షుద్ర పూజల కలకలం!

 అనంతపురం: ఉరవకొండ మండలం ఆమిద్యాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నూతనంగా నిర్మించిన ఓ ఇంట్లో గృహప్రవేశం జరగకముందే గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. ఇంటి ముందు బొగ్గుతో ముగ్గులు వేసి, పసుపు కుంకుమతో పాటు రక్తం లాంటి పదార్థాన్ని ఉంచి, దీపం వెలిగించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఇంటి యజమానులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.