TPT: తిరుమల శ్రీవారిని రాష్ట్ర BJP అధ్యక్షుడు మాధవ్ దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. "దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రధాని కృషి చేస్తున్నారు. మోదీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయం సాధించాలి. మోదీ తలపెట్టిన సేవా సంకల్ప ఉత్సవ్ పేరిట కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం" అని మాధవ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర BJP అధ్యక్షుడు


