హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారుల పనులపై మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సమీక్ష

సత్యసాయి: అనంతపురం ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో జిల్లా రోడ్లు, భవనాల శాఖ రహదారుల అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు, పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.