KDP: సిద్దవటం మండలం మాచుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ రేణుక యల్లమాంబకు శ్రావణమాసం సందర్భంగా ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకం, పలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు.పరిసర గ్రామాల నుంచి వచ్చిన మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
రేణుక యల్లమాంబకు విశేష పూజలు


