VZM: చీపురుపల్లిలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఆదివారం వివిధ రకాల పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. పండ్ల అలంకరణలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీంతో ఆలయం భక్తుల రాకతో సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
పండ్ల అలంకరణలో కనకమహాలక్ష్మి అమ్మవారు


