VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లిలో తెగుళ్ల గురించి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ శంకరరావు వివరించారు. పాల్గొన్న రైతులు సామూహికంగా పత్ర ద్రావణాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తెగుళ్ల నివారణకు రసాయనిక పురుగుమందులను ఉపయోగించకుండా పత్ర కషాయాన్ని వినియోగించాలని రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పత్ర ద్రావణంతో తెగుళ్ల నివారణ


