హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ జిల్లాలో రోజూ PGRS: కలెక్టర్

NTR: జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజూ PGRS నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పని దినాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు. స్వీకరించిన అర్జీలను వెంటనే నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా పకడ్బందీ చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.