హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు

SKLM: కోటబొమ్మాలి (M) లోని ఆధ్యాత్మిక క్షేత్రం కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆలయ ప్రాంగణంలో ప్రాకార మండపం నిర్మాణంతో పాటు ఆలయ అభివృద్ధి, మరమ్మతుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. దీంతో ఆలయ అభివృద్ధికి మరో చారిత్రాత్మక ముందడుగు పడిందని గ్రామస్తులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.