హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారు బంటుపల్లిలో "నమస్తే ఎచ్చెర్ల"

SKLM: రణస్థలం మండలంలోని బంగారు బంటుపల్లిలో "నమస్తే ఎచ్చెర్ల" కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ కళిసెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే "నమస్తే ఎచ్చెర్ల" కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.