హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తప్పని సాగుకు నీటి కష్టాలు'

ASR: వర్షాలు సమృద్ధిగా కురిసినా గిరిజన ప్రాంతాల్లో సాగుకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా 1,400 మి.మీ. వర్షపాతం నమోదైనా రబీలో కేవలం 10 శాతం భూముల్లోనే సాగు జరుగుతోంది. చెక్‌డ్యామ్‌లు, కాలువలు, చిన్న రిజర్వాయర్లు శిథిలమవడంతో వర్షపు నీరు నిల్వ ఉండటం లేదు. దీంతో సాగు పనులు తగ్గి వలసలు పెరుగుతున్నాయి. చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.