హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొడవలూరు రైల్వేగేటు సమీపంలో నరకప్రాయంగా ప్రయాణం

నెల్లూరు: కొడవలూరు రైల్వే గేటు సమీపంలో ప్రయాణం వాహనదారులకు నరకప్రాయంగా మారింది. గేటు వద్ద నుంచి కొడవలూరు ప్రధాన రహదారి వరకు రోడ్డు రాళ్లు తేలి గుంతలగా మారింది. కొడవలూరు, విడవలూరు, అల్లూరు 3 మండలాలకు అనుసంధానంగా ఉన్న రహదారి కావడంతో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. అధికారుల స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.