హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొత్తూరు మండలంలో మోస్తరు వర్షం

SKLM: కొత్తూరు మండలంలో ఆదివారం ఉదయం నుంచి మోస్తరుగా చినుకులు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎండలు ఉండగా, ఈరోజు కురిసిన చినుకులతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈరోజు సాయంత్రం వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.