హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SV ప్రభుత్వ పాలిటెక్నిక్ లో ఉచిత వెబ్ డెవలపర్ శిక్షణ

TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో PMKVY 4.0 కింద వెబ్ డెవలపర్ కోర్సులో 300 గంటల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఇంటర్మీడియట్, ITI లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 31లోపు పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు.