హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి: శిల్పా రవి

NDL: సాగు, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న వైసీపీ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి తెలిపారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని శనివారం చెప్పారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టౌన్, రూరల్, గోస్పాడు రైతులు పాల్గొనాలని పేర్కొన్నారు.