హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో పర్యటించనున్న మంత్రి లోకేశ్

PLD: జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నరసరావుపేట విద్యార్థుల వసతి సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. కాకాని క్యాంపస్‌లో బాలబాలికల కోసం రూ.70 కోట్లతో నిర్మించిన నాలుగు హాస్టల్ భవనాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సెప్టెంబర్ 2న ప్రారంభించనున్నారు. ఈ హాస్టళ్ల ద్వారా సుమారు 1,440 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కలగనుంది.