హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షాల కోసం కప్పల ఊరేగింపు

BPT: కారంచేడు గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు ఆదివారం కప్పల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఒక కర్రకు మధ్యలో కప్పలను వేలాడదీసి డప్పు వాయిద్యాలతో గ్రామంలో తిరుగుతూ వర్షాలు కురవాలని వాన దేవుడిని ప్రార్థించారు. ఊరేగింపు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు లేక పంటలు సాగు చేయలేకపోతున్నామని, వానదేవుడు కరుణించి వర్షాలు కురువాలని ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.