హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లంక భూముల సమస్యపై ఎమ్మెల్యే స్పందన

కృష్ణా: తోట్లవల్లూరు మండలం గుర్వింద‌పల్లి శివారు లంక భూముల రైతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వల్ల కుమార్ రాజా హామీ ఇచ్చారు. రైతులతో కలిసి భూములను పరిశీలించి రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రీ- సర్వేలో హద్దులు మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని, పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు.