హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పొన్నూరులో భారీ చోరీ..!

GNTR: పొన్నూరు షరాఫ్ బజార్‌లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక వ్యాపారి కొల్లిపర సుబ్బారావు ఇంట్లోకి చొరబడిన దుండగులు 16 సవర్ల బంగారం, 3 కిలోల వెండిని దోచుకెళ్లారు. కుమార్తె పెళ్లి కోసం కూడబెట్టిన సొత్తు దొంగలపాలవ్వడంతో ఆ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయింది. బాధితుల ఫిర్యాదుతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.