SKLM: DSC ఆత్మ గౌరవ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు పలాస మండలం గరుడకండి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస నుంచి క్యాబ్‌లో వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వజ్రపుకొత్తూరు 108 అంబులెన్స్ సిబ్బంది పలాస ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పలాస వద్ద ఉద్యోగుల కారును ఢీకొన్న RTC బస్సు


