హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..!

W.G: నరసాపురం నందమూరి కాలనీకి చెందిన టైలర్ కె. యేసు(63) ఈ నెల 26న టైలరింగ్ షాప్‌కు వెళ్తుండగా ఇందిరమ్మ విగ్రహం వద్ద కుక్క అడ్డంగా రావడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో తొలుత నరసాపురం, భీమవరం ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఆయనను అనంతరం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడి కుమారుడు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.