హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యారాడ బీచ్‌లో యువకుడు గల్లంతు

VSP: యారాడ బీచ్‌లో ఆదివారం ఉదయం ఆవిరల్ సింగ్ (23) అనే యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో, సముద్ర తీరంలో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు, సహాయక సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. యువకుడు ఎలా గల్లంతయ్యాడనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.