హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షికారి పేటలో 40 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

NDL: నందికొట్కూరు పట్టణంలోని షికారి పేటలో ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా షికారి రాజు వద్ద 40 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, ఊటను ధ్వంసం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.