హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్‌ పరీక్షకు భారీ బందోబస్త్..!

అన్నమయ్య: మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో 125 మంది, కురబలకోట మండలం అంగళ్లు మిట్స్‌ కళాశాలలో 387 మంది విద్యార్థులు ఆదివారం నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఉదయం 8:30 గంటల తర్వాత విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించకుండా నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు.