AKP: నాతవరం మండలంలో చమ్మచింత ,కురువాడ గ్రామాలలో ఆదివారం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 300 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 బైకులు, ఒక ఆటో, 25 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఐ ఆధ్వర్యంలో గ్రామాలలో సోదాలు


