హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగచోళ్ళపెంట విద్యార్థినుల సత్తా

VZM: తిరుపతిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ ఖోఖో పోటీలలో గజపతినగరం మండలంలోని గంగచోళ్ళపెంట హైస్కూల్ విద్యార్థినులు సత్తా చాటారు. అండర్ 17 విభాగంలో జరిగిన పోటీలో తామాడ పూర్ణిమ, పాసల జయంతి, ఆవుగడ్డి గౌరీ, శ్రీదీక్షితులు రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ మేరకు పిడి సత్యనారాయణ వారిని అభినందించారు.