ASR: కొయ్యూరు రహదారిలో కాకరపాడు సమీపంలోని కొండవాగుపై ఉన్న బ్రిటీషు కాలం నాటి వంతెన శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెన కొట్టుకుపోయే ప్రమాదం నెలకొంది. ఈ వంతెనపై ఆరు పంచాయతీలకు చెందిన 75 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థకు చేరిన బ్రిటీషు కాలం నాటి వంతెన


